Logo
Date of Publish : 18 February 2023, 2:46 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ బాటలో మైలవరం జనసేన నాయకులు

       ఇబ్రహీంపట్నం, (జనస్వరం) : పవిత్ర సంగమం వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన నాయకులు భక్తులకు అల్పాహారం, చిన్న పిల్లలకు వృద్దులకు కాఫి, పాలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంగమం వద్ద జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో భారీగా భక్తులు పాల్గొని అల్పాహారన్ని స్వీకరించారు. మహాశివరాత్రి రోజున ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా పార్టీని ప్రజలలోకి తీసుకు వెళ్లాలని, పార్టీ అధ్యక్షుని బాటలో ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని జనసైనికులు తెలియజేసారు. ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు బత్తిన శ్రీనివాసరావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు పాల్గొని భక్తులకు సేవచేయడం చాలా ఆనందంగా ఉందని ఉదయం నుండి సుమారు 15000 మందికి అల్పాహారం అందించామని, పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలలో జన సైనికులు ముందు ఉంటారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ జనసేన నాయకులు చెరుకుమల్లి సురేష్, దేవబత్తుల నాగబాబు, సామల సుజాత, సిరిపురం సురేష్,చిట్టెలు కోటేశ్వరరావు, ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com