ఈ కరోనా విపత్కర సమయంలో ఆక్సిజన్ అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ గారికి జనసేన రాష్టఅధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల రామమోహనరావు ( గాంధీ ) గారు అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఎంతో మంది ప్రజలు ఆక్సీజన్ అందక ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి ప్రాణాలు కాపాడాలి అని అండగా ఉండాలని నిర్ణయం తీసుకోవటం మీ ఔన్యత్యాన్ని చూపారు. తెలుగు రాష్టాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రతి జిల్లాకి ఒక ఆక్సీజన్ బ్యాంకు ఏర్పాటు చేయటం జరుగుతుంది. 25 సంవత్సరాలకు ముందు కుటంబంలో రక్తం ఇవ్వాలి అంటే అందరు భయం పడే రోజులు చిరంజీవి పిలుపు మేరకు అభిమానులు అభిమానించే వారు ముందుకు వచ్చి రక్తం దానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగారు. కళ్ళు లేక చూడ లేని వారికి నేత్ర దానం ద్వారా చూపుని ఇచ్చారు. 9.50 లక్షలు మందికి రక్తం దానం 7 వేల మందికి నేత్ర దానం ఇప్పటివరకు చేసి ప్రాణ దాతలు అయ్యారు. గడిచిన 40 సంవత్సరాలనుండి రాష్టంలో అనేకసార్లు వరదలు వచ్చినప్పుడు అలాగే పేదవారికి ఆరోగ్యం విషయంలో గాని చదువుకొనే విషయంలో ఆర్ధికంగా ఆదుకోవటం జరిగింది. ఇటీవల కాలంలో సినీపరిశ్రమకు సంబందించిన కార్మికులకు కరోనా కాలంలో నిత్యావసర సరుకులు ఇవ్వటం ఇబ్బందులలో వున్నవారికి ఆర్థికంగా తోటి హీరోలతో కలసి ఆదుకోవటం జరిగింది. ఎపుడు ఎదుటి వారి మంచి కోరుకునే చిరంజీవి, రాంచరణ్, నాగబాబు, చిరంజీవులుగా ఉండాలని కోరుకుంటున్నాము. మీకు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ తరుపున జనసేన పార్టీ తరుపున ప్రజల తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.
వీటిని కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com