Logo
Date of Publish : 08 October 2022, 6:52 am
Editor : Sake Naresh

పొన్నూరు నియోజకవర్గంలో వడ్రానం మార్కండేయ బాబు ఆధ్వర్యంలో “నాసేన కోసం నా వంతు”

     పొన్నూరు, (జనస్వరం) : పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం తోట్లపాలెం గ్రామంలోని హరిజనవాడలో జనసేనపార్టీ గ్రామ అధ్యక్షుడు కారూరి పృథ్వి మాదిగ ఆధ్వర్యంలో జనసేనపార్టీ తలపెట్టిన "నాసేన కోసం నా వంతు"కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన కుటుంబం గురించి గానీ తన పిల్లల భవిష్యత్తు గురించి గానీ తన జీవితం గురించి గానీ ఆలోచించకుండా పార్టీ కోసం సమాజం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. సినిమా నుంచి వచ్చిన డబ్బు కూడా పార్టీ కోసం రైతు భరోసా యాత్రల కోసం ఖర్చు పెడుతూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అని ప్రసంగించారు. హరిజనవాడకు చెందిన ఎస్సీ ఎస్టీ నాయకులు మాట్లాడుతూ మేము పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం మన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన కులాలను కలుపుకొని పోయే ఆలోచన విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం వంటి సిద్ధాంతాలు నచ్చి పార్టీ కోసం మా ఊరు కోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీరాములు, జిల్లా సంయుక్త కార్యదర్శి మేకల రామయ్య, ఉపాధ్యక్షులు నారిశెట్టి కృష్ణయ్య, దొడ్డ వినయ్, నిస్శంకర రమేష్, ముద్దంగుల గోపి, గ్రామ అధ్యక్షుడు కారూరు పృథ్వి మాదిగ, గ్రామ యూత్ అధ్యక్షుడు చిలువూరు రవి, మాదిగ మండల కమిటీ మెంబర్ అందె నవీన్ మాల, కోటూరి మోహన రావు, చిల్లి వీరయ్య, చిలి వెంకటేశ్వర్లు, రాజువత్తి రమేష్ , కాకుమానుఅనిల్, కల్వరపు రంజిత్, కొల్లిపర ప్రశాంత్, కట్టవరపు సన్నీ, సందీప్ బోనాసి, బోనాసి బాలు, కటేవరపు పవన్, సౌపాటి దినేష్, పోలిశెట్టి సతీష్, పోట్లూరి పోతురాజు, న్యాపతి పవన్, కోటూరి రాజేంద్ర, కోటూరి రవీంద్ర, చిల్లి కాట్రాజు, సౌపాటి ప్రకాష్ రాహుల్, ఆనంద్ తదితర జనసేనపార్టీ నాయకులు, యువకులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com