పార్వతీపురం ( జనస్వరం ) : ” నా సేన కోసం నా వంతు ” కార్యక్రమాన్ని, పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండల కేంద్రంలో జనసైనికులతో నిర్వహించడం జరిగింది.అనంతరం “అహింసా మూర్తి” శ్రీ మహాత్మ గాంధీ గారి విగ్రహానికి మరియు జై జవాన్ జై కిసాన్ అంటూ స్వాతంత్య్ర సమరంలో తనదైన శైలిలో పోరాటం చేసిన శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, మండల నాయకులు గంట్యేడ స్వామి నాయుడు, పరుచూరి రమణ, ఉంగరాల నాగేశ్వరరావు, అక్కుం నాయుడు, సంతోష్, గన్నెర వాసు, వంశీ, త్రినాథ్, గోవింద్, సత్యం నాయుడు జనసైనికులు పాల్గొన్నారు.