- అంతిమ అధికారం ప్రజల చేతుల్లోకి వెళ్ళాలి :
- ప్రజలకు పల్లకి మోయనడానికి వచ్చిన పార్టీ జనసేన :
- నియోజకవర్గం ఇంచార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి Dr యుగంధర్ పొన్న.
గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటినగరం మండలం, కొట్టార్వేడు పంచాయతీ, కొట్టార్వేడు గ్రామం, గోపిశెట్టిపల్లి పంచాయితీ, ఈదువారి పల్లి ఏఏ డబ్ల్యూ, ఈదువారిపల్లి హెచ్ డబ్ల్యు గ్రామాల్లో జనం కోసం జనసేన (భవిష్యత్తు గ్యారెంటీ) కార్యక్రమం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తెన మధుబాబు హాజరయ్యారు. మూడు గ్రామాల్లో ఉన్న ప్రజలకి ప్రత్యేక విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యుగంధర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోసమే నా జీవితం అంకితం చేస్తున్నాని చెప్పారు. 24 గంటలు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. జనసేన లక్ష్యం అంతిమ అధికారం ప్రజల చేతుల్లోకి వెళ్ళాలని,
ప్రజలకు పల్లకి మోయనడానికి వచ్చిన పార్టీ జనసేన అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని, వచ్చేసరి కొత్త ప్రజా ప్రభుత్వంలో ప్రతి గామాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దామని, సర్వరంగ సమగ్ర అభివృద్ధి సాధిస్తామని, ఆదర్శ గ్రామంగా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లా ఉపాధ్యక్షులు బత్తెన మధుబాబు మాట్లాడుతూ సుదూర ప్రాంతం నుంచి నియోజకవర్గ ప్రజలతో మమేకమై, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయడమే మా లక్ష్యం అని తెలిపారు. మీ అందరితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషమని తెలియజేశారు. ఒక ఆశ్చర్యమైన ఆలోచన శక్తి కలిగిన పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నరేష్, మండల కాపు యువసేన అధ్యక్షులు వెంకటేష్, మండల బీసీ సెల్ అధ్యక్షులు దేవా, యం యం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, మండల కార్యదర్శి గంగయ్య, జనసేన సీనియర్ నాయకులు బుజ్జి, నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్రవంతి రెడ్డి, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com