విజయనగరం ( జనస్వరం ) : జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తో కలసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకున్నానని, త్వరలోనే మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీలో చేరుతానని ప్రముఖ వ్యాపారవేత్త, సంఘసేవకులు, యువనేత గురాన అయ్యలు అన్నారు. సోమవారం ఉదయం అర్.టి.సి. కాంప్లెక్స్ వద్దనున్న హోటల్ జి.ఎస్.ఆర్. ఇంటర్నేషనల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19 న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిశానని,స్వతహాగా మెగా ఫ్యామిలీకి అభిమానినని,గతంలో ప్రజారాజ్యం పార్టీ, యువరాజ్యం విభాగంలో పనిచేశానని, పవన్ కళ్యాణ్ ఆయన ఆలోచనా విధానాన్ని ముందునుండి చూసిన వాడినని, అందుకే పవన్ కళ్యాణ్ ఆశయాలకోసం నడుద్దామని నిర్ణయించానని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ అన్యాయమైన,స్వార్థపూరిత రాజకీయ పాలనావ్యవస్తను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెబుతూ, జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ పోరాటస్పూర్తి, అందరికీ సమన్యాయం, మంచి చేయాలనుకునే పవన్ నాయకత్వం నచ్చిందని, మంచి సుపరిపాలన ఇచ్చే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని అందరూ బలపరిచే సమయం ఆసన్నమైందని అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినవారు, వివిధ పార్టీల్లో కష్టపడినా గుర్తింపు లేనివారు జనసేన పార్టీలో చేరి మద్దతు ఇవ్వాలని కోరారు. మర్రిచెట్టు కింద ఉన్నారా,మల్లె చెట్టు కింద ఉన్నారా అని ఓ పత్రికా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను ఎప్పుడూ నా ఆలోచనా ధోరణితో నా సొంత నిర్ణయాలతోనే ముందుకెళ్తానని,ఏ చెట్టుకింద ఉండే వాడినికాదని స్పష్టం చేశారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి, జిల్లాలో ఉన్న ప్రథాన సమస్యలను, స్థానిక సమస్యలపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి, వాటిపై పోరాడుతూ పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తనని తెలిపారు.