నందలూరు ( జనస్వరం ) : నందలూరు మండల వాలంటీర్లు పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి ఇంట్టు కొట్టి పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. దానికి నిరసనగా వాళ్ళు అంబేడ్కర్ గారి విగ్రహం ముందరే ఈరోజు నందలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మందుగా ఆయనకు పాలాభిషేకం చేసి వాళ్ళు మాట్లాడిన అబద్దాలకి ఆయనని పాలతో శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తరువాత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి వాలంటీర్ లు మాట్లాడిన మాటలను నందలూరు జనసేన నాయకులు ఖండించడం జరిగింది. ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కార్యవర్గ సభ్యులు గురివిగారి వాసు మాట్లాడుతూ ఏ వ్యవస్థలో అయినా మంచి, చెడు ఉంటాయి అని పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థలో జరగుతున్న తప్పిదాలను ఎత్తిచూపారు. మంచి చేస్తున్న వారిని ఏమి అనలేదు. కొందరు వాలంటీర్ లు ప్రజల డేటా అల్లరి మూకలకు, రౌడీలకి ఇవ్వడం వలన మన స్టేట్ లో అమ్మాయిల మిస్సింగ్ కేసులు చాలా జరుగుతున్నాయి. ఇంకా ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి అని చెప్పారు. ఎవరిని కించపరచలేదని, వైయస్సార్సీపీ వాళ్ళు కొందరు ఆ మాటలను వక్రీకరించి వాలంటీర్లను రెచ్చగొడుతున్నారు. ఇంకా ఆయన వాలంటీర్లకు ఐదువేలు ఏమి సరిపోతుంది వారికి ఇంకొ ఐదువేలు అదనంగా ఇచ్చినా సరిపోదు డిగ్రీలు, పీజీలు, బీటెక్ లు చదివి ఐదువేలకు పని చేస్తుంటారు. వారి శ్రమకు తగిన ఫలితం లేదని, వారి వద్ద వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రిపాపల్లి సుబ్బు, సాయి పవణ్, తిప్పాయిపల్లి ప్రశాంత్, పాటూరుడాల, మండెంరాము, ఉపేంద్ర, సాయి రాజు, మురళి పాటూరు, హరీష్, షైక్ షాకీర్, బాషా, పెట్టగడ్డ మస్తాన్ రాయల్, లక్ష్మీ నారాయణ, అంజి, శివ, మల్లి దాసరగడ్డ, యర్రా శ్రీను, మంకు వెంకటేష్ తదితరుల పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com