గుంటూరు ( జనస్వరం ) : ఎంతోమంది గొప్ప క్రీడాకారులను అందించిన బ్రహ్మానంద రెడ్డి స్టేడియాన్ని అభివృద్ధి చేయటంలో పూర్తిగా విఫలమైన స్థానిక శాసనసభ్యుడు ముస్తఫా తీరుపై జనసేన పార్టీ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తున్న స్టేడియం దుస్థితిపై గురువారం జనసేన పార్టీ శ్రేణులు స్టేడియంలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో రెండు పర్యాయాలు ప్రజలు అధికారమిస్తే నియోజకవర్గాన్ని ముస్తఫా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారన్నారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం అట్టడుగు స్థాయిలో ఉందంటూ విమర్శించారు. పదేళ్లు అధికారమిచ్చినా తన కార్యాలయం ఎదుట కళ్ళముందు ఉన్న స్టేడియాన్ని అభివృద్ధి చేయని అసమర్ధ నాయకుడు ముస్తఫా అంటూ ధ్వజమెత్తారు. గుట్కా, గంజాయి వంటి మాదకద్రవ్యాల సరఫరాపై ముస్తఫాకు ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేదని దుయ్యబట్టారు. గుంటూరు కమల్ హాసన్ గా పేరొందిన ముస్తఫా కపట నాటకాలని ప్రజలు గమనించారన్నారు. తన మొహాన్ని ప్రజలకు చూపించలేక రానున్న ఎన్నికల్లో తన కుమార్తెను నియోజకవర్గంలో పోటీ చేయించాలని చూస్తున్నారని విమర్శించారు. నాలుగున్నారేళ్లుగా జగన్ రెడ్డి ప్రజల జీవితాలతో ఆడుకున్నది చాలదన్నట్లుగా ఆడుదాం ఆంధ్ర అంటూ కొత్త పథకాన్ని తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా మైదానాలను, క్రీడాకారులను ఏనాడూ పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటూ రావటం సిగ్గుచేటన్నారు. ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్రవేశ పెట్టిన మరో పధకంగానే ఈ పథకాన్ని ప్రజలు భావిస్తున్నారని నేరేళ్ళ సురేష్ అన్నారు. నగర ప్రధాన కార్యదర్శి యడ్ల నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ సుమారు లక్షమందికి పైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం కలిగిన స్టేడియాన్ని పాలకులు తమ అసమర్ధతో నిరుపయోగంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియంలో క్రీడాకారులకు , కోచ్ లకు , వివిధ ఆటల నిర్వహణకు నిర్మించిన నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే వైసీపీ నేతలకు క్రీడల విలువ ఎలా తెలుస్తుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ , జనసేన కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచాక స్టేడియం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని నాగమల్లేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ,నగర ఉపాధ్యక్షులు చింత రేణుక రాజు, నగర ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉపేంద్ర, నగర కార్యదర్శులు బండారు రవీంద్ర, సుధా నాగరాజు, తోట కార్తీక్, షేక్ బాషా, పావులూరి కోటేశ్వరరావు, షేక్ అయుబ్ఖన్, కల్లగంటి త్రిపుర కుమార్, Sk ఆశ, తిరుమల శెట్టి కిట్టు, తిరుమల శెట్టి నరేష్, నగర సంయుక్త కార్యదర్శులు పులిగడ్డ గోపి, బొందిలి నాగేంద్ర సింగ్, బందెల నవీన్ బాబు,మరియు డివిజన్ అధ్యక్షులు రోశయ్య, శేఖర్, సురేష్, దాసరి అశోక్, ఏడుకొండలు, శాంతి కుమార్, బాలకృష్ణ, నరేష్, గట్టు శ్రీకాంత్, యాట్ల దుర్గాప్రసాద్, మరియు కోల అంజి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.