Logo
Date of Publish : 03 February 2023, 4:10 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ లో ముస్లిం సోదరులకు ప్రత్యేక గుర్తింపు ఉంది : గునుకుల కిషోర్

           నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీలో ముస్లిం సోదరులకు ప్రత్యేక గుర్తింపు ఉందని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ  వారి అభిమానాన్ని పార్టీ కి మద్దతు మార్చి గాజు గ్లాస్ కి ఓటు వేయిద్దాం అంటూ స్థానిక 48వ డివిజన్ కార్యకర్తలు షాజహాన్, ప్రతాప్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపు ఏడవ రోజులో భాగంగా వారి కుటుంబ సభ్యుల మద్దతు తీసుకొని స్థానిక ఇరుగు పొరుగు వారికి జనసేన డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. పలువురు ముస్లిం కుటుంబాలు ఈసారి జనసేనకు మద్దతు ఇస్తామంటూ సంతోషంగా పలకరించారు. ముస్లిం పేద కుటుంబాలకు ఇస్తున్న షాదీ తోఫా,పేద విద్యార్థులకు ఇవ్వవలసిన స్కాలర్షిప్లు జాప్యం చేసి వారిని లెక్క పెట్టడం లేదు ఈ వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధి లేక వివిధ భాగాలకు చెందిన నిధులను మళ్లింపులో భాగంగానే ఇటువంటి అవస్థల కు గురికావాల్సి వస్తుంది. వైసీపీ నేతలు తమ సొంత నిధులను ఇస్తున్నట్లుగా ఓటు వేసి గెలిపించిన ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది.. రాష్ట్ర అభివృద్ధి జరిగి అన్ని వర్గాల వారు సమాన ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి జనసేన ను గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, షాజహాన్, ప్రతాప్, కంతర్ణబాయ్, అమీన్, మౌనేష్, హేమచంద్ర, అలేఖ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com