● చెత్త తీయండి అంటే మునిసిపల్ సిబ్బంది సంబంధం లేదంటున్నారు
●పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద వాపోయిన ప్రజలు
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం రెండవ రోజు స్థానిక మైపాడు రోడ్డు వేణుగోపాల్ నగర్ లో కొనసాగింది. ఆ ప్రాంతంలోని ఆరు వీధుల్లో ఇంటింటికి తిరిగి ప్రచార కరపత్రాన్ని పంచిపెట్టారు. ప్రతి ఇంటి వాకిలికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ స్టిక్కర్ అంటించారు. స్థానికులు వారి సమస్యలను కేతంరెడ్డికి వివరించారు. సావధానంగా ప్రతి ఒక్కరి సమస్యను విన్న కేతంరెడ్డి ఆ సమస్యలను తన డైరీలో వ్రాసుకుని ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం పోరాడతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ తాము చేపట్టిన పవనన్న ప్రజాబాట ద్వారా ప్రజలు వైసీపీ ప్రభుత్వం పై ఎంత అసహనంతో ఉన్నారో, ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం అవుతోందన్నారు. రెండో రోజు ప్రజాబాటలో ఆరు వీధులు తిరిగితే వీధికొక సమస్య దాపురించి ఉందని విమర్శించారు. ముఖ్యంగా ప్రజలు దుర్గంధభరితంగా మారిన తమ వీధుల పరిస్థితిని తనకు వివరించారని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటి నుండి 120 రూపాయలు చెత్త పన్ను విధిస్తున్నారని, కానీ చెత్త తీసేందుకు మాత్రం ప్రతి రోజు మునిసిపల్ సిబ్బంది రావట్లేదని ప్రజలు తెలిపారన్నారు. దీంతో కొన్ని సార్లు వీధులపైనే చెత్త వేయాల్సి వస్తోందని, ఆ సమయంలో అలా వీధుల్లో వేసిన చెత్తను సిబ్బంది తీసుకెళ్లట్లేదని ప్రజలు తెలిపారన్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో సైడు మురికి కాలువల్లో మురికినంతా వీధుల్లోకి పూడిక తీసారని, కానీ ఆ పూడిక తీసిన మురికిని ఇప్పటివరకు మునిసిపల్ సిబ్బంది తొలగించలేదని, దీంతో దుర్గంధంతో వీధుల్లో తిరుగలేకున్నాం అని ప్రజలు తెలిపారన్నారు. మురికిని తీయండి అని మునిసిపల్ సిబ్బందిని అడిగితే తమ పని కేవలం ఇళ్ళ నుండి చెత్తను సేకరించడమే అని, వీధుల్లో మురికితో, చెత్తతో తమకు సంబంధం లేదని సమాధానం ఇస్తున్నారని ప్రజలు వాపోయారన్నారు. తాను తిరిగిన ఆరు వీధుల్లో అన్నింట్లోను ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని కేతంరెడ్డి తెలిపారు. చెత్తకి పన్ను వేస్తున్న వైసీపీ పాలన మొత్తం చెత్తమయంగా ఉందని విమర్శించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఇలాంటి చెత్త పరిస్థితులు ఉండవని, ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరిని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి, జీవన్, ప్రభాకర్, శ్రీకాంత్, జాఫర్, సాయి, మహిళా నేతలు sk ఆలియ, శిరీష రెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com