Search
Close this search box.
Search
Close this search box.

ప్రజలు సమస్యల మీద వినతిపత్రం స్వీకరణకు కూడా జంకుతున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు : చెన్నారెడ్డి మనుక్రాంత్

మనుక్రాంత్

              నెల్లూరు ( జనస్వరం ) : ప్రజలు సమస్యల మీద వినతిపత్రం స్వీకరణకు కూడా జంకుతున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నెల్లూరు కార్పొరేషన్లోని స్థానిక సమస్యలు మీద నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలసి మున్సిపల్ కమీషనర్ గారికి వినతిపత్రం ఇవ్వటానికి నెల్లూరు మన్సిపల్ ఆఫీసుకు చేరుకున్న వారిని బారి సంఖ్యలో పోలీసులు లోపలికి రానివ్వకుండ ఆంక్షలు విధించారు. తదుపరి కార్యకర్తలను రానివ్వకుండ నాయకులను మాత్రం పరిమితి సంఖ్యలో లోనికి అనుమతించారు. లోనికి వెళ్లేటప్పటికి ఉదయం నుంచి మూడు సార్లు ఆపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి కూడ మున్సిపల్ కమీషనర్ హరిత గారు అందుబాటులోకి రాలేదు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు మరియు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ గారు మాట్లాడుతూ, నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మేము పర్యటిస్తున్నపుడు అనేక సమస్యలు ప్రజలు మా దృష్టికి తీసుకొని వచ్చారు. రోడ్ల దుస్థితి దోమల సమస్య డ్రైనేజి కాలువలు పూడికలు తీయకపోవడం కుక్కలు, పందుల స్వైరవిహారం చెత్త సేకరించటంలో జాప్యం 1. నెల్లూరు నగరంలో ఇటీవల పడిన వర్షం వలన రోడ్లు అన్ని జలమయం అయిపోయాయి. మున్సిపల్ పరిధిలో రోడ్లు వేసిమరల అండర్ గ్రౌండ్ వాటర్ పైపులైన్స్ త్రవ్వి ఆ రోడ్లన్ని అస్థవ్యస్థం అయిపోయాయి. 2. నెల్లూరు నగరంలో పన్నులు వసూలు చేసుకునే ఇల్లుతప్ప, ఏ పాయింట్లో చెత్తను క్లియర్ చేయండం లేదు, వాటి వల్ల దుర్వాసన, దోమలు ఎక్కువుగా అయిపోయినాయి. వాటిని పట్టించుకోవడంలేదు. 3. అంతే కాకుండ రోడ్లల్లో పగలు, రాత్రుళ్లు వీధి కుక్కలు, పందులు వలన ప్రజలు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 4. మురుగు ఏర్పడటం వలన దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ విషజ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు కూడా ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారితో పాటు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా మరియు నగర నాయకులు గుత్తు శ్రీకాంత్, కంతర్, అక్కిశెట్టి శ్రీధర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way