మదనపల్లి ( జనస్వరం ) : దశాబ్దం ముందు మదనపల్లె చూట్టూ ఏర్పడిన కాలనీలకు పేర్లు పెట్టారు కానీ అక్కడి జనం పడుతున్న కష్టాలను పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ ఆరోపించారు. సోమవారం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మున్సిపల్ చైయిర్ పర్సన్ మనూజ దృష్టికి తీసుకువచ్చారు. వారం లోగా సమస్య పరిష్కారానికి చోరవ చూపకపోతే కాలనీ వాసులతో కలిసి వచ్చే సోమవారం నుండి మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపడుతామని ప్రకటించారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని చంద్ర కాలనీ, అనపగుట్ట, మంజునాధ కాలనీ, బి.కె.పల్లిలో ఇంటికి మంచినీటి సౌకర్యం, రోడ్లు, మురికి నీటి కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మైఫోర్స్ మహేష్ ఆద్వర్యంలో చేపట్టిన జనం కోసం జనసేన కార్యక్రమంలో ప్రత్యక్షంగా చూసిన సమస్యలను ఆయా కాలనీ వాసులతో కలిసి నెల రోజుల క్రితం పిర్యాదు చేయడం జరిగింది. బి.కె. పల్లిలో మురికినీటి కాలువలు ఏర్పాటు చేయాలని, ఇంటింటికి మంచినీరు సరఫరా చేయాలని, వీధులలో సిమెంటు రోడ్లు నిర్మాణం పూర్తి చేయాలని ప్రజల పక్షాన ఇప్పటికే పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పేరుకు మాత్రమే ప్రజా ప్రతినిధులు వున్నారని ప్రజా సమస్యలు పరిష్కారానికి మాత్రం చోరవ చూపడం లేదని ఆరోపించారు. బి.కె. పల్లిలో పాలకుల వైఫల్యం కన్నులకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. ప్రజల కనీస సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం చెందిన పాలకుల కళ్ళు తెరిపించడానికి వచ్చే సోమవారం నుండి మున్సిపాలిటీ ఎదుట రీలే నిరాహార దీక్షలు చేపడుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు శోభ, సునీత జనసేన పార్టీ నాయకులు శ్రీనాథ్, నరేష్, నాగేంద్ర, సోను, హర్ష తదితరాలు పాల్గొన్నారు.