Logo
Date of Publish : 23 November 2023, 8:59 pm
Editor : Sake Naresh

కూకట్ పల్లిలో ముమ్మరంగా జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రచారం

      కూకట్ పల్లి  ( జనస్వరం ) : కూకట్పల్లి డివిజన్లోఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రముఖ సినీ నటి, బిజెపి నాయకురాలు కవిత గారు ప్రచార యాత్రలో పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఎలా అభివృద్ధి చెందిందో చూశాం, అలాగే రాష్ట్రం బాగుండాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి తీసుకురావాలని కోరారు.పవన్ కళ్యాణ్ గారు కూడా సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని పెద్దన్నలా భావించి ఆయన వెంట నడుస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటున్నాను. ముమ్మారెడ్డి రెడ్డి ప్రేమ కుమార్ గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఆయన విద్య, వైద్య, ఉద్యోగ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.ఆయనను ఈ కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకోవడం జనసేన పార్టీ అధ్యక్షులు  కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే,ప్రియమైన ఓటర్ మహాశయులారా ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను.కూకట్పల్లి డివిజన్లో మైత్రి నగర్, వడ్డేపల్లి ఎంక్లేవ్, ప్రశాంతినగర్,సాయిబాబా కాలనీ, వరకు పాదయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో ఎ.సూర్య రావు,వడ్డేపల్లి రాజేశ్వరరావు, పవన్ సాయి, నాగరాజు, శంకర్, ఈశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com