శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు "మన ఊరు మన ఆట" కార్యక్రమంలో భాగంగా వినుత కోటా గారి ఆధ్వర్యంలో రేణిగుంట పట్టణం , పాంచాలి నగర్ 15 వ వార్డు నందు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో రేణిగుంట పట్టణం నుండి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలను నిర్ణయించే జడ్జిలుగా విజేత స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా మధుకర్ సింగ్, జూనియర్ లెక్చరర్ ఉమా దేవి విచ్చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలుగా మొదటి బహుమతి పాంచాలి నగర్ కి చెందిన పి.మోహన సాధించి బంగారు కమ్మలు పొందారు. రెండవ బహుమతి పాంచాలి నగర్ కి చెందిన పి.భువనేశ్వరి సాధించి వెండి కుంకుమ భరిణె పొందారు. మూడవ బహుమతి బుగ్గ వీధి కి చెందిన కె. సంధ్య సాధించి మిక్సర్ గ్రైండర్ పొందారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకి కంటైనర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ ఇంఛార్జి భాగ్య లక్ష్మి, మండల ఇంఛార్జి చిన్నతోటి నాగరాజు, నగరం భాస్కర బాబు, ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు తోట గణేష్, ముని శంకర్, శ్రీనివాసులు, త్యాగరాజు, జ్యోతి కుమార్, ఉమా మహేశ్వరి, మాజీ ఎంపీటీసీ జయలలిత, రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, జనసైనికులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com