రాజంపేట ( జనస్వరం ) : సిద్దవటం మండలంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ మరియు జనసేన పార్టీ నాయకులు అతిగారి కృష్ణ గార్ల ఆధ్వర్యంలో సిద్ధవటం బద్వేల్ ప్రధాన రహదారి నందు భారీ స్థాయిలో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 167 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీలలో మొదటి బహుమతిగా ఒంటిమిట్ట మండలానికి చెందిన విజయలక్ష్మికి 30 వేల రూపాయలు, రెండవ బహుమతి సిద్ధవటం మండలానికి చెందిన విజయశాంతి 20వేల రూపాయలు, మూడవ బహుమతిగా సుబ్బలక్ష్మి, అబిత, అనే ఇద్దరు మహిళలకు 10,000 రూపాయలు న్యాయ నిర్ణీతలు ఎంపిక చేశారు. విజేతలుగా ఎన్నికైన మహిళలకు నగదును జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్, రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్, రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతిగారి కృష్ణ గార్లు చేతులమీదుగా అందజేశారు. పోటీలలో పాల్గొన్న మిగతా మహిళలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com