Logo
Date of Publish : 25 July 2026, 5:08 am
Editor : Sake Naresh

కడియంలో ముద్రగడ సంస్కరణ సభను విజయవంతం చేయాలి

- కాపు ఐక్యవేదిక నాయకుల పిలుపు

కడియం, జూలై 24 (జనస్వరం): కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభను ఈ నెల 26న కడియంలోని జీఎన్‌ఆర్ కళ్యాణ వేదికలో నిర్వహించాలని కాపు ఐక్యవేదిక నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు సభను విజయవంతం చేయాలని అఖిలపక్ష కాపు నాయకులు వెలుగుబంటి ప్రసాద్, గిరజాల బాబు, అన్నందేవుల చంటి, ముద్రగడ జెమీ, గట్టి సుబ్బారావు, రావిపాటి రామచంద్రరావు, గట్టి నర్సయ్య, ఆదిమూలం సాయిబాబా, పాఠంశెట్టి రవి, తిరుమలశెట్టి శ్రీనివాస్, వెలుగుబంటి నాని, తోకల శ్రీనివాస్ తదితరులు పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా మండల స్థాయిలో కాపులతో పాటు ముద్రగడ అభిమానులను కూడా సభకు ఆహ్వానించాలని, ఆహ్వాన కమిటీ భారీ ఏర్పాట్లు చేయాలని కోరారు. ముద్రగడ తన జీవితాన్ని కాపు జాతి సంక్షేమం కోసం అంకితం చేశారని, ఆయన రాజకీయ జీవితంలోని లోపాలను వెతకడం సరికాదన్నారు. కాపులంతా ఐక్యంగా ఆయనకు నివాళులర్పించడం కనీస బాధ్యత అని పేర్కొన్నారు. మండలంలోని 11 గ్రామాల నుంచి ముద్రగడ అభిమానులు పెద్దఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడియం, వేమగిరి, వీరవరం, దుళ్ళ, మురమండ, దామిరెడ్డిపల్లి, మాధవరాయుడుపాలెం, వెంకయ్యమ్మపేట, బూరిలంక, జేగురుపాడు తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కాపు నాయకులు పాల్గొన్నారు.

కాపు సంక్షేమ నిధులు భద్రం
పూర్వం నిర్వహించిన కాపు కార్తీక వనసమారాధనలో మిగిలిన రూ.7 లక్షల నిధులు డిపాజిట్ల ద్వారా ప్రస్తుతం రూ.21 లక్షలకు చేరాయని కాపు ఐక్యవేదిక నాయకుడు తిరుమలశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఆ నిధులను కాపు సంక్షేమానికే వినియోగించాలని అభిప్రాయపడ్డారు. తాత్కాలిక కార్యక్రమాలకు కాకుండా కాపుల శాశ్వత సంక్షేమ నిధిగా వినియోగించే విధంగా భారీ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించాలని కాపు ఐక్యవేదిక నాయకులు తీర్మానించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com