Logo
Date of Publish : 22 June 2023, 7:25 am
Editor : Sake Naresh

ముద్రగడ పద్మనాభం జగన్ రెడ్డికి పెద్ద పాలేరుగా మారారు

       నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 305వ రోజున 9వ డివిజన్ నవాబుపేట పుల్లమ్మసత్రం ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష బలంగా నెలకొందని, ఆ దిశగా ప్రజలందరి అపూర్వ ఆదరణతో నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట జరుగుతోందన్నారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం పై ప్రజల్లోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా అందరిలో ఉత్సాహం నెలకొందని, వైసీపీ పతనానికి అది సూచికగా మారిందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న అపూర్వ స్పందనను చూసి ఓర్చుకోలేని వైసీపీ నేతలు పలువురు గజ్జికుక్కల్లా మారి మొరుగుతున్నారని అన్నారు. మచిలీపట్నంలో పొట్టోడు పేర్ని నానికి మతి తప్పి గుడి బయట చెప్పుల దొంగతనాలకు పాల్పడుతున్నాడని, అన్నవరంలో గుడి బయట వదిలిన పవన్ కళ్యాణ్ గారి చెప్పులను దొంగతనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో కొట్టుకుంటున్నాడని, ఆ అహంకారాన్ని అణచివేస్తామని అన్నారు. కాపు ఉద్యమ నేతగా ముసుగేసుకున్న ముద్రగడ పద్మనాభం జగన్ రెడ్డికి పెద్ద పాలేరు అనే విషయం రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అర్థమైందని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేరని, ప్రజలందరి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com