ముదినేపల్లి, (జనస్వరం) : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, సమయానికి ధాన్యం డబ్బులు పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి వాతావరణం అనుకూలించక నానా ఇబ్బందులు పడుతూ, సరైన సమయంలో రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందకపోవడం ఆంధ్ర రాష్ట్ర రైతులు పడుతున్న బాధలు చూసి చలించిపోయి జనసేన పార్టీ రైతులు, కౌలు రైతులకు తాము ఎంతోకొంత వారి కుటుంబాలకు అండగా ఉండాలి అనే ఆలోచనతో మరణించిన రైతులకి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 5కోట్లు రూపాయలు ప్రకటించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం అని వారు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి ఎప్పటికి రైతుల పక్షపతి అని దేశంలోనే రైతులకు పెన్షన్ అందించాలి అని గొప్ప ఆలోచన మేనిఫెస్టోలో ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక్కటే అని తెలిపారు. రైతులకి ఎలాంటి ఆపద వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటారు అని గతంలో కూడా తుఫాన్ కారణంగా నష్టపోయిన కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులను అయన పరామర్శించి అయన ఆదుకున్నారు అని తెలిపారు. అలానే అప్పులు బాధతో మరణించిన రైతులను రేపటి నుండి అనగా 12/04/2022 అనంతపురం జిల్లా నుండి మొదలవుతుంది అని తెలిపారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మరణించిన రైతు కుటుంబాలని పరామర్శించి ప్రతి రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించనున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, కృష్ణ జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, కృష్ణ జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ మెంబెర్ చెన్నంశెట్టి చక్రపాణి, ముదినేపల్లి మండల జనసేన పార్టీ నాయకులు మోటేపల్లి హనుమా, పోకల కృష్ణ, కూనపరెడ్డి రాజా, దాసరి నాగఆంజనేయులు, మండల జనసైనికులు వడ్లని ఆంజనేయులు, అబ్బిశెట్టి నరేష్, గుడిసె సురేష్, పాశం శ్రీను, ఎర్రంశెట్టి శివ ప్రసాద్, సుదాబత్తుల సాయిష్, అంబుల భరత్, అను కుమార్, భూపల రామ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.