Logo
Date of Publish : 21 February 2022, 8:05 am
Editor : Sake Naresh

VRA లు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపిన ముదినేపల్లి జనసేన నాయకులు

    ముదినేపల్లి, (జనస్వరం) : కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం MRO వారి కార్యాలయము నందు రిలే దీక్ష చేస్తున్న VRA లకు మద్దతుగా ముదినేపల్లి మండల జనసేనపార్టీ నాయకులు సంఘీభావం తెలిపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 రోజులు నుండి రిలే దీక్ష చేస్తున్న VRAల సమస్యలు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ వ్యవస్థలో కీలక పాత్ర పోషించేది VRA లని, అలాగే ముఖ్యమంత్రి పాదయాత్రలో VRA లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేని యెడల ఈ విషయం గురించి జిల్లా అధ్యక్షులు శ్రీ బంద్రెడ్డి రామకృష్ణా గారి ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరకి తీసుకువెళ్తాను అని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పురి నానాజీ, VRA ల కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు పి.వి రాఘవేంద్రరావు, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మోటేపల్లి హనుమా, పోకల కృష్ణా, తనుకుల రవితేజ , మండల నాయకులు -వడ్లని ఆంజనేయులు, అంబుల భరత్, మల్లంపల్లి వీరబాబు, భూపాల నాని, ఎర్రంశెట్టి శివప్రసాద్, వాలిశెట్టి బాబీ, సీతాళం చంద్ర కుమార్, సీతాళం ఫణి, షణ్ముక్, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com