శ్రీకాళహస్తి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి వినుత కోటా గారు ప్రారంభించిన "KNOW MY CONSTITUENCY" కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని మంచినీళ్ళ గుంట, ఇందిరా కాలనీలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
ఈ క్రింది సమస్యలు ప్రజలు వినుత గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది.
1. ప్రధానంగా మంచినీళ్ళ గుంట కాలనీ లో బాగున్న సీసీ రోడ్డును 3 ఇంచ్ ల మంచినీటి పైప్ కోసం 10 అడుగుల సీసీ రోడ్ ను ద్వంసం చేశారని నెలలు గడుస్తున్నా రోడ్ బాగు చెయ్యక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వినుత గారి దృష్టికి తీసుకుని వచ్చారు.
2. ప్రధానంగా నిత్యావసర వస్తువులు ధరలు అమాంతం పెరిగి సామాన్యుడు బ్రతకాలని పరిస్థితిలో ఉంటే ఈ ముఖ్యమంత్రి పేద ప్రజలకు అందుబాటులో సినిమా టికెట్ అందిస్తానని చెప్పడం ఓట్లు వేసినందుకు మాకు తగిన శాస్తి చేశాడని వాపోయారు. పేదలకి అందుబాటులోకి తేవాల్సింది నిత్యావసర వస్తువులు, సినిమా టికెట్లు కాదు అని అన్నారు.
3. అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇంటి పట్టాలు ఇంత వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇస్తామని మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేస్తున్నారని, ఈ ముఖ్యమంత్రి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు ఇస్తున్నాడు కానీ, మేము నివసిస్తున్న ఇళ్ళకి పట్టాలు ఇవ్వమంటే ఇవ్వడం లేదని తెలియజేశారు.
4. మంచినీళ్ళ గుంట, ఇందిరా కాలనీలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంటూ నెలల కొద్దీ మునిసిపాలిటీ వారు పారిశుధ్య పనులు చెయ్యడం లేదని తెలియజేశారు.
5. మంచినీళ్ళ గుంట దగ్గర ఉన్న పార్క్ ఎలాంటి మెయిన్టనన్స్ లేకుండా ప్రస్తుతం అడవిలా, కొలనులా ఉందని తెలియజేశారు. ప్రజల సమస్యలను మునిసిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టరు గారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా జనసేనపార్టీ ప్రజల కోసం పోరాడుతుందని వినుత గారు ప్రజలకు బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్ గారు, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు రాఘవయ్య గారు, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ గారు, రేణిగుంట మండల అధ్యక్షులు మునికుమార్ రెడ్డి గారు, మరియు నాయకులు ప్రమోద్, మణికంఠ, సురేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com