శ్రీకాళహస్తి, (జనస్వరం) : శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి వినుత కోటా గారు ప్రారంభించిన " KNOW MY CONSTITUENCY " కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని NTR నగర్ లో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. మఖ్యంగా త్రాగునీరు ,డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, ఇళ్ళపట్టాలు, నిత్యావసర ధరల విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు పూట గడవడం కూడా కష్టంగా ఉందని తెలియజేశారు. ప్రజల సమస్యలను మునిసిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టరు గారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందని వినుత గారు ప్రజలకు బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్ గారు, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు రాఘవయ్య గారు, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ గారు, నాయకులు మణికంఠ,ప్రమోద్,సురేష్, నితీష్, కిషోర్, చందు, గిరీష్,మునిసేఖర్, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com