Logo
Date of Publish : 27 November 2021, 5:59 am
Editor : Sake Naresh

GVMC లో జనసేన ఫ్లోర్‌ లీడర్‌ గా శ్రీమతి వసంత లక్ష్మి – డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గా శ్రీ దల్లి గోవింద రెడ్డి గారిని నియమించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

     విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్‌ లో జనసేన ఫ్లోర్‌ లీడర్‌ గా శ్రీమతి భీశెట్టి వసంతలక్ష్మి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గా శ్రీ దల్లి గోవింద రెడ్డిలను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు నియమించారు. మున్సిపల్‌ కార్పొరేషన్ల కౌన్సిల్‌ లో జనసేన పార్టీ నుంచి నియామకం జరుగుతున్న తొలి పదవులు ఇవే. జనసేనపార్టీలో వీర మహిళలకు పార్టీ అధ్యక్షులు ఎనలేని ప్రాధాన్యాన్ని ఇస్తున్న సంగతి విదితమే. పార్టీ కమిటీలలో కూడా వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు. 33 శాతం పదవులలో వీర మహిళలను నియమించాలని కూడా నిర్దేశించారు. మహిళా సాధికారతను గౌరవిస్తూ పోరాటపటిమ కలిగిన వీర మహిళ శ్రీమతి వసంత లక్షిని జనసేన ప్లోర్‌ లీడర్‌ గా ఎంపిక చేశారు. జనసేన పార్టీపై గంగపుత్రులు అవిభాజ్యమైన ప్రేమానురాగాలను చూపుతుంటారు. గంగవరంలో గంగపుత్రులు అధికంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతమంతా మత్య్యకారులే నివసిస్తుంటారు. కార్పొరేషన్‌ ఎన్నికలలో వారు జనసేన అభ్యర్థిని గెలిపించుకున్నారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా గంగవరం డివిజన్‌ నుంచి ఎన్నికైన శ్రీ దల్లి గోవింద రెడ్డిని డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌ గా ఎంపిక చేశారు. మత్స్యకారుల పట్ల తనకున్న అభిమానాన్ని శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అకుంఠిత దీక్షతో శ్రీమతి వసంత లక్ష్మి, శ్రీ గోవిందరెడ్డి కృషి చేస్తారని విశాఖ నగర వాసులకు తెలియచేస్తూ వారిరువురికి శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు శుభాశీస్సులు అందచేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com