అమరావతి, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి రాయపాటి అరుణను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలిచ్చారు. శ్రీమతి అరుణ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందినవారు. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లా కమిటీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. సమస్యలపై స్పందించే విధానం, విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చే వాక్పటిమను గమనించి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలను శ్రీమతి అరుణకు అప్పగించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com