
ఎచ్చర్ల, (జనస్వరం) : సిక్కోలు జనసేన క్రికెట్ టొర్నమెంట్లో భాగంగా విజయపథంలో దూసుకుపోతున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన టీంకి తమ వంతు మద్దతుగా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ టీషర్టులు బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ఫైనల్స్ వరకు వెళ్లి విజయం సాధించాలని కోరుకుంటూ రాష్ట్రానికి మరియు దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు.