ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం పెనసాం గ్రామంలో రాములమ్మ గారు వయస్సు (55) ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ గారు పరామర్శంచి ఆరోగ్యం ఖర్చులకు కొంత చేయూత నివ్వడం జరిగింది. అలాగే పెనసాం లో గేదల శాంతమ్మ గారు ఎప్పటి నుంచో అనారోగ్యం తో ఇబ్బంది పడుతున్నా విషయం కాంతి శ్రీ గారు తెలుసుకొని ఆమెను పరామర్శంచి, ఆమె ఆరోగ్యానికి ఆసుపత్రుల ఖర్చుల కోసం కొంత డబ్బు చేయూత నివ్వడం జరిగింది. నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జి.సిగడాం మండల నాయకుడు శ్రీ తాలబత్తుల పైడి రాజు గారు, సింహాచలం, కాకర్ల.బాబాజీ, గ్రామ జనసైనికులు ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com