ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలరద్దు హర్షణీయం కువైట్ జనసేన పార్టీ నాయకులు కాంచన శ్రీకాంత్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు హర్షణీయం ఇది ప్రజాస్వామ్యానికి స్థానిక స్వపరిపాలనకు ఉసురు పోసే తీర్పు అని, ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీచేసి కోవిడ్ పరిస్థితుల కారణంగా ఎన్నికల రద్దు చేశారని, తిరిగి అదే నోటిఫికేషన్ పై ఏడాది తర్వాత జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించడం అంటే ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో తొక్కినట్లేనని అన్నారు. ఏప్రిల్ లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టినప్పుడు జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని, తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని స్పష్టంగా డిమాండ్ చేసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఎన్నికలు నిర్వహించడానికి సమయత్తం కావడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించిందని అన్నారు. తుదకు హైకోర్టు ఎన్నికను రద్దు చేయాలని తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యం విజయంగా భావిస్తున్నామని రాష్ట్రప్రభుత్వం ఇకనైనా పంతాలకు పట్టింపులకు పోకుండా తగిన సమయంలో తాజా నోటిఫికేషన్ జారీచేసి ఎన్నికలు నిర్వహించాలని జనసేన తరపున కాంచన శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వీటిని కూడా చదవండి :
సీఎం భజన చేయడానికి అసెంబ్లీ సమావేశమా ? : జనసేన నాయకులు, లాయర్ జయరాం రెడ్డి
భవన నిర్మాణ కార్మికులకు, రోజూ వారి కూలీలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి : జనసేన నాయకుడు అక్కల గాంధీ మోహనరావు
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : జనసేన PAC సభ్యులు చిలకం మధుసూధన్ రెడ్డి
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here