Search
Close this search box.
Search
Close this search box.

ఎంపీటీసీ జెడ్పిటీసీ ఎన్నికల రద్దు హర్షనీయం : జగ్గయ్యపేట జనసేన నాయకులు బాడీశ మురళీకృష్ణ

ఎంపీటీసీ

         ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు హర్షనీయం అని జనసేన పార్టీ నియోజకవర్గ నేత బాడీశ మురళీకృష్ణ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. ఇది ప్రజాస్వామ్యానికి స్థానిక స్వపరిపాలనకు ఉసురు పోసే తీర్పు అని అన్నారు. ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి కోవిడ్ పరిస్థితుల కారణంగా ఎన్నికలు రద్దు చేశారు. తిరిగి అదే నోటిఫికేషన్ పై ఏడాది తరువాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కినట్లే ఏప్రిల్ లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టినప్పుడే జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది. తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని స్పష్టంగా డిమాండ్ చేసింది అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఎన్నికలు నిర్వహించడానికి సమయత్తం కావడంతో జనసేన హై కోర్ట్ ను ఆశ్రయించింది. తుదకు హైకోర్ట్ ఈ ఎన్నికను రద్దు చేయాలనీ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పంతాలకు పట్టింపులకు పోకుండా తగిన సమయం లో తాజా నోటిఫికేషన్ జారీచేసి ఎన్నికలు నిర్వహించాలని జనసేన తరపున బాడీశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

వీటిని కూడా చదవండి : 

సీఎం భజన చేయడానికి అసెంబ్లీ సమావేశమా ? : జనసేన నాయకులు, లాయర్ జయరాం రెడ్డి

భవన నిర్మాణ కార్మికులకు, రోజూ వారి కూలీలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి : జనసేన నాయకుడు అక్కల గాంధీ మోహనరావు

ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల రద్దు హర్షణీయం : రేఖగౌడ్

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way