
రాయవరం, (జనస్వరం) : రాయవరం మండల పరిషత్ సమావేశంలో చెల్లూరు గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలు (విద్యుత్, అంగన్ వాడి కోడి గుడ్లు నాణ్యత పైన, పసలపూడి నుండి సూర్యారావు పేట ప్రధానమైన రహదారిని నిర్మించాలని) పై ఎంపీడీఓ గారికి మరియు సంబంధిత అధికారులకు చెల్లూరు జనసేనపార్టీ ఎంపీటీసీ శ్రీమతి గొల్లపల్లి అనురాధ వినతి పత్రాలు లిఖిత పూర్వకంగా సమర్పించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.