రాజోలు పంచాయతీ నుండి నిధులు కాజేసిన ప్రభుత్వాన్ని ఏకీపారేసిన MPTC దార్ల కుమారి లక్ష్మి

రాజోలు

              రాజోలు ( జనస్వరం ) : రాజోలు పంచాయతీ నుండి నిధులు మళ్ళించడాన్ని వ్యతిరేకిస్తూ తనని నమ్మి ఓట్లు వేసిన ఓటర్లు తరపున గళం వినిపించిన రాజోలు జనసేన mptc 1 దార్ల కుమారి లక్ష్మి. ఆమె పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఉగాది కానుకగా జగన్ మోహన్ రెడ్డి  రాజోలు పంచాయతికి కేటాయించిన 60 లక్షల రూపాయలు కాజేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే నిధులు లేక గ్రామ అభివృద్ధి కుంటుపడింది అంటే ఇప్పుడు వచ్చినా 60 లక్షల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రి తీసుకోవడాన్ని జనసేన పార్టీ తరపు నుండి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 15 వేల మంది జనాభా ఉన్న రాజోలు గ్రామంలో కనీసం డ్రైనేజ్ బాగు చేయించుకోలేని పరిస్థితి. ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. రోడ్లు నిర్మించుకో లేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంగతి పక్కన పెడితే కనీసం వీధిలైట్లు, త్రాగునీరు కూడా గ్రామంలో లో అందించలేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. అసలు కేంద్రం గ్రామాభివృద్ధికి ఇచ్చిన నిధులు పంచాయతీ బోర్డు ఆమోదం లేకుండా ఎలా తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. ఒక రాజోలు మాత్రమే కాదు రాష్ట్రంలో రమారమి 13000 పంచాయతీలలో ఇదే పరిస్థితి. ఈ మాత్రం దానికి పంచాయతీలు సర్పంచులు వార్డు మెంబర్లు దేనికి? కేవలం వాళ్లు కీళ్ళు బొమ్మల్లా మిగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును గ్రామ సర్పంచులు అందరూ కూడా వ్యతిరేకించాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నామని అన్నారు. అదే విధంగా రాజోలు గ్రామాభివృద్ధికి కేంద్రం నుండి కేటాయించినా60 లక్షల రూపాయలు తిరిగి వెంటనే పంచాయతీ ఖాతాలో జమ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం అన్నారు. లేనిపక్షంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way