మాస్కులు, శానిటైజర్లు పంపిణీ, గ్రామాలను పిచికారి చేసిన ఎచ్ఛర్ల జనసైనికులు
ఇపుడు ప్రపంచం మొత్తం మానవాళి కరోనా మహమ్మారితో అనారోగ్య బారిన పడింది. ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇంతవరకూ కనగొనలేదు. కావున మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ కరోనా మహమ్మారి మన దరికి చేరకూడదు అంటే మాస్కులు మాత్రమే మనకు ఆయుధం. ఆ కరోనా లాక్ డౌన్ కాలంలో జనసైనికులు చేసిన జనసేవ కార్యక్రమాలు అభినందించదగినవి. వివరాల్లోకి వెళ్తే జి. సిగడం మండలం గల పెనసం గ్రామం మరియు సేతుబీమవరం ,గంగాదరపాలెం గ్రామాల్లో జనసేన పార్టీ జి. సిగడం మండల నాయకులు తాలబత్తుల పైడిరాజు మరియు కార్యకర్తలు కరోనా విస్తృతంగా పెరుగుతుండగా కరోనా అరికట్టే క్రమంలో భాగంగా గ్రామాల్లో ఐపోక్లోరైడ్ పిచికారి చేయడం జరిగింది. అలాగే ఈగ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి మరియు గ్రామ వాలంటీర్లకు మాస్కులు, శానిటైజర్లు లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాలబత్తుల పైడి రాజు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలి అని, ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని తెలియజేసారు .ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ బీజేపీ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బొల్లు రమేష్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సింహాచలం, ఈశ్వరావు, రమణ సాయి, రాంబాబు మరియు గ్రామ యువత నాగార్జున, శ్రీను, పవన్ పొలిరాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.