
ఎమ్మిగనూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు పై అధికారులు ఓటర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నమోదు చేసుకోవాలని జనసేన నాయకులు రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా 18 ఏళ్ల నిండిన కొత్త ఓటర్లను కూడా చేర్పించాలని వివరించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిని కూడా జాబితాలో నమోదు చేయించాలని ఈ సందర్భంగా కోరారు.