అనంతపురం ( జనస్వరం ) : జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ కాలనీ వాసులతో వెళ్లి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమిని కలిసి వినపత్రం అందించారు. అక్కడ కాలనీవాసులు పడుతున్న బాధలను, సమస్యలను వివరించి ఇండ్ల మధ్యలోకి వచ్చిన డ్రైనేజ్ ఫొటోస్ ని చూపించారు. కలెక్టర్ గారిని కాలనీలలో ఒకసారి సందర్శించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమి గారు మాట్లాడుతూ తప్పకుండా ఆయా కాలనీలలో సందర్శించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం టి.సి.వరుణ్ గారు మీడియా వారితో మాట్లాడుతూ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది అని అనంతపురము నగరంలో రూ. కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశానని చెబుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని అన్నారు. చెరువులో కనిపిస్తున్న కల్పన జోష్, భాగ్యనగర్, బిందెల కాలనీలలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపాలంటూ ప్రశ్నించారు. వైసిపి పరిపాలన ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన స్థానిక సంస్థలు నగరంలో నిర్వీర్యమయ్యాయి. 50 డివిజన్లో కార్పొరేటర్లను కట్టబెడితే వారు సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేశారు. ఇక ప్రధానంగా రెండవ డివిజన్ కల్పనా జోష్, భాగ్యనగర్ నగరంలో బతుకు భయం భయంగా సాగుతోంది అని కాలనీవాసులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అనంతపురము నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లిన పరిష్కరించిన పాపాన పోలేదని అన్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా మురుగునీరు వెళ్లే దారులు లేక మడుగుగా ఏర్పడిందని వాపోయారు. 12 అడుగులకు పైగా ఉన్న విషయసర్పాలు కాలనీలో సంచరిస్తున్నాయని, పాములు, తేలులు, పురుగు గుట్ట ఇళ్లల్లోకి చొరబడుతున్నాయని దోమలు వ్యాప్తి చెందడం పందులు స్వైర విహారం చేయడం వల్ల పిల్లలు అనారోగ్య బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వీధిదీపాలు కూడా సరిగ్గా వెలగడం లేదని. ఎన్నిసార్లు చెప్పినా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కాలనీ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానని శ్రీ టి.సి.వరుణ్ గారు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com