Logo
Date of Publish : 18 May 2026, 8:46 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు

మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు.

నరసరావుపేట, మే 18 ( జనస్వరం)

నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని లింగంగుంట్ల ఏరియా వైద్యశాలను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఎమ్మెల్యే వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, పరిశుభ్రత, మందుల నిల్వలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశమైన డాక్టర్ అరవింద బాబు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్య సేవలు అందించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సిబ్బందికి ఆయన సూచించారు. తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే వెంట వైద్యశాల సూపరింటెండెంట్, వైద్యులు, స్థానిక నాయకులు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com