Logo
Date of Publish : 10 December 2025, 2:40 pm
Editor : Sake Naresh

పెంచలయ్య కుటుంబానికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అండ

నెల్లూరు,అక్టోబర్ 10, (జనస్వరం) : గంజాయి, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలపై పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు పెంచలయ్య కుటుంబానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొండంత ధైర్యంగా నిలిచారు. పెంచలయ్య పెద్దకర్మ సందర్భంగా ఆర్డిటి కాలనీ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పాల్గొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన జరిగిన 24 గంటలలోపే నిందితులను అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించారు. కుటుంబానికి ప్రత్యక్షంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వారి కుమార్తెల చదువు బాధ్యతలను తానే తీసుకుంటానని ప్రకటించారు. ఈ నిర్ణయం స్థానిక ప్రజల్లో విశేష స్పందన తీసుకొచ్చింది. పెంచలయ్య స్మారకార్థంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఆర్డిటి కాలనీ అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలతో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే ప్రకటించారు. మాటలకంటే చేతలే మిన్న అన్న విధంగా కుటుంబానికి అన్ని విధాల అండగా నిలిచిన తీరు ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, బిజెపి నాయకులు ఎర్రబోలు రాజేష్తో పాటు జనసేన పార్టీ, సిపిఎం పార్టీ, బిజెపికు చెందిన పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. పెంచలయ్య ఆశయాలను కొనసాగిస్తామని, అసాంఘిక శక్తులపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com