నెల్లిమర్ల, మార్చి 17, (జనస్వరం) : రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి డెంకాడ మండలంలోని చింతలవలస, అక్కివరం మరియు పరిసర గ్రామాల్లోని మసీదులను సందర్శించి ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. మొత్తం ఆరు రకాల నిత్యావసర వస్తువులతో సిద్ధం చేసిన ప్యాకెట్లను 130 కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పర్వదినం దానం, దయ, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాస దీక్షల ద్వారా ఆధ్యాత్మికత పెంపొందించే ఈ పవిత్ర మాసం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముస్లిం సోదర సోదరీమణులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.