శ్రీకాళహస్తి ( జనస్వరం ) : పట్టణానికి సమీపంలో ఈదలగుంట కాలనీలో గత 40 సం. గా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న ప్రజలను కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు జెసిబి లు తీసుకొచ్చి ఖాళీ చేయాలంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు నియోజకవర్గ జనసేన ఇంఛార్జి వినుత కోటా గారి ఇంటికి వచ్చి జనసేన పార్టీ అండగా నిలవాలని కోరారు. సమస్యను వారి కాలనీకి వెళ్లి పరిశీలించిన వినుత జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు కార్డు, కరెంట్ క్యానెక్షన్ ఇచ్చిన వారు ఇప్పుడు మీకు ఏ ఆధారాలు లేవని చెప్పడం అవివేకం అని తెలిపారు. జగనన్న ఇళ్ళ పట్టాలు అని ఎక్కడో ఊరికి 10 కి మీ దూరంలో ఇచ్చే బదులు ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారికి పట్టాలు ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి వెళ్ళినపుడు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు వెళ్లి సమస్య చెబితే మీ ఊరు ఎక్కడ ఉందో నాకు తెలియదు అని గర్వంగా మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు. ఈ కబ్జాలో ఎమ్మెల్యే వాటా 2 ఎకరాలు అని స్థానికులు చెప్పారు, అందుకోసమే అధికారులు, పోలీసులు రౌడీ ఇజం చేసే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. నిన్నటి రోజు 100 మంది రౌడీలు మద్యం సేవిస్తూ, మహిళల పై సైతం దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు. మీకు జనసేన పార్టీ తోడు ఉంటుందని మీ ఇళ్లు కూల్చకుండ అడ్డుకుంటామని మాట ఇచ్చారు. జనసేన – టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పట్టాలు ఇస్తామని మాట ఇచ్చారు.
ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు దౌర్జన్యం చేస్తున్నందున సమస్యను పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లేందుకు స్థానిక డి.యస్.పి గారు బందోబస్తులో ఉన్నందున శ్రీకాళహస్తి పట్టణ 2 టౌన్ SI గారిని ప్రజలతో వెళ్లి వినుత గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. కబ్జా దారులపై తగిన చర్యలు తీసుకుని ప్రజలకి న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ , కావలి శివకుమార్, శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి రవి కుమార్ రెడ్డి, నాయకులు గురవయ్య, దినేష్, సురేష్, రాజేష్ , బబ్లూ, గోపి తదితరులు పాల్గొన్నారు.