Logo
Date of Publish : 26 November 2025, 7:04 am
Editor : Sake Naresh

రైతన్న వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి

విజయనగరం, అక్టోబర్ 25, (జనస్వరం) :
‘రైతన్న - మీ కోసం’ వారోత్సవాల సందర్బంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఈరోజు డెంకాడ మండలం పెదతాడివాడ రైతు సేవా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 24 నుండి 29 వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే మాధవి రైతులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతేనని ఆమె పేర్కొన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని వ్యాఖ్యానిస్తూ, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను అలవరచుకుని అధిక దిగుబడులు సాధించాలంటూ సూచించారు. పంటల బీమా, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. రైతులకు అందుతున్న సదుపాయాలపై ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. రైతు సేవ కేవలం ఒక కార్యక్రమం కాదు, నిరంతర ఉద్యమంలా కొనసాగించాలని ఎమ్మెల్యే మాధవి అధికారులకు సూచించారు. రైతు సేవా కేంద్రాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బాధ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com