Logo
Date of Publish : 12 November 2025, 4:25 pm
Editor : Sake Naresh

ఎరుకోండ గ్రామంలో ప్రజలతో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి

నెల్లిమర్ల, నవంబర్ 12, (జనస్వరం): నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పూసపాటి రేగ మండలం లోని ఎరుకోండ పంచాయతీ పరిధిలో నిర్వహించిన “మన ప్రజలతో – మన ఎమ్మెల్యే” కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలను ఆత్మీయంగా కలుసుకుని, వారి సమస్యలు, అవసరాలు మరియు గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యలు, పారిశుద్ధ్యం లోపం, కాళువలు మూసుకుపోవడం, వీధి దీపాలు పనిచేయకపోవడం, కరెంట్ స్తంభాల మరమ్మతులు వంటి అంశాలను వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సంబంధిత అధికారులను ఆదేశించి, గ్రామంలో శుభ్రత చర్యలు చేపట్టాలని, డ్రైనేజ్ మరియు కాళువలను శుభ్రం చేయాలని, వీధి దీపాలు, కరెంట్ స్తంభాలను తక్షణమే మరమ్మతు చేయాలని సూచించారు. ప్రజలకు శుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై గ్రామాభివృద్ధి దిశగా కృషి చేస్తున్న లోకం నాగ మాధవి ప్రజాసేవా నిబద్ధత అందరి ప్రశంసలను అందుకుంది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com