Logo
Date of Publish : 19 January 2026, 8:23 pm
Editor : Sake Naresh

రాష్ట్రస్థాయి అథ్లెట్‌కు ఎమ్మెల్యే లోకం మాధవి ప్రోత్సాహం

నెల్లిమర్ల, జనవరి 19, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం వసంత కోలయ్యవలస గ్రామానికి చెందిన యువ అథ్లెట్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఇటీవల చీరాలలో నిర్వహించిన 36వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025లో పాల్గొని 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుల్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించడంతో పాటు, సౌత్ జోన్ నేషనల్స్ 200 మీటర్ల విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ విజయాలతో విజయనగరం జిల్లాతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చారు. ఈ విజయాల వెనుక తమకు లభించిన ప్రోత్సాహాన్ని అథ్లెట్ గుర్తు చేసుకుంటూ, గతంలో సరైన క్రీడా కిట్ లేకపోవడం వల్ల అనేక పోటీలకు దూరమవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ పరిస్థితిని తెలుసుకున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి వెంటనే స్పందించి అవసరమైన అథ్లెటిక్స్ కిట్ అందించడం తన జీవితానికి మలుపు తిప్పిందని కృతజ్ఞతతో వెల్లడించారు. ఆ ఒక్క సహాయమే తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వరుస విజయాలకు బాటలు వేసిందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరింత కష్టపడి భారతదేశాన్ని ప్రతినిధ్యం వహించి, ఆంధ్రప్రదేశ్‌కు మరియు విజయనగరం జిల్లాకు మరిన్ని పతకాలు తీసుకురావడమే తన లక్ష్యమని అథ్లెట్ స్పష్టం చేశారు. తన ప్రతిభను గుర్తించి అండగా నిలిచిన లోకం నాగ మాధవి పేరును ఎల్లప్పుడూ గౌరవంగా నిలబెడతానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన కార్యాలయంలో అథ్లెట్‌ను కలుసుకుని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించి భవిష్యత్ విజయాలకు ఆశీర్వదించారు. క్రీడల్లో రాణిస్తున్న యువతకు తమ పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి అవసరమైన సహకారం అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడలు, యువత, ప్రతిభకు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎప్పుడూ గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైంది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com