Logo
Date of Publish : 14 April 2026, 3:02 pm
Editor : Sake Naresh

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

పట్టణంలోని తాలూకా సెంటర్ నందు మరియు రఘురామ్ నగర్ కార్యాలయం నందు
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  135వ జయంతి వేడుకలలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మి నారాయణ.

సత్తెనపల్లి,ఏప్రిల్ 14 ( జనస్వరం)

రాజ్యాంగ నిర్మాత, మహా మేధావి, దార్శనికుడు, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించిన జాతిరత్నం డా.బి.ఆర్. అంబేద్కర్.మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా, అంబవాడ గ్రామంలో 1891 ఏప్రిల్ 14న జన్మించారు.కుల వివక్ష, అస్పృశ్యత, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడారు.ప్రజలందరికీ సామాజిక న్యాయం అందాలన్నదే అంబేద్కర్ ఆశయం.

అంబేద్కర్ స్ఫూర్తి, ఆశయాల బాటలో తెలుగుదేశం పార్టీ.తెలుగుదేశం పార్టీ నిర్మాణంలోనే అంబేద్కర్ ఆశయాల సాధన ఉంది.పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, బి.ఆర్. అంబేద్కర్ తనకు ఆదర్శం అని చాటి చెప్పారు."సమాజమే దేవాలయం -ప్రజలే దేవుళ్ళు" అనే ఎన్టీఆర్ ప్రభోదం అంబేద్కర్ స్ఫూర్తి నుండి వచ్చిందే.నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే అంబేద్కర్ కి భారతరత్న అవార్డు ప్రకటించారు.పార్లమెంటు హాల్లో డా.అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి గౌరవించారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు రాజ్యాధికారం కోసం అంకితభావంతో కృషి చేస్తోంది.కె.ఆర్. నారాయణను రాష్ట్రపతిగా, బాలయోగిని లోక్సభ స్పీకర్గా, మహేంద్రనాథ్్న ఆర్థికశాఖ మంత్రిగా, కాకి మాధవరావుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రతిభాభారతి ని శాసనసభ స్పీకర్గా నియమించడం జరిగింది.

జస్టిస్ పున్నయ్య కమిషన్ 42 సిఫార్సులను యధాతథంగా ఆమోదించాం.ఎస్సి, ఎస్టి అత్యాచారాల నిరోధానికి, కేసుల సత్వర పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం 22 మొబైల్ కోర్టులు, 23 స్పెషల్ కోర్టులను మంజూరు చేసింది.

దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు, దళిత ఉద్యోగులకు ప్రమోషన్లు, సక్రమంగా సబ్ ప్లాన్ నిధుల వినియోగం, దళిత కాలనీల్లో మౌలిక సౌకర్యాల కల్పన, సంక్షేమ హాస్టళ్ల ఏర్పాటు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి అనేక చర్యలను చేపట్టింది.

రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్. అంబేద్కర్ సేవలు అందరికీ గుర్తుండేలా తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని అమరావతిలో 125 అడుగుల విగ్రహ నిర్మాణం చేపట్టింది.

కానీ, అమరావతిలో 15 ఎకరాల విస్తీర్ణంలో "డా॥ బి. ఆర్. అంబేద్కర్ స్మృతివనాన్ని సర్వనాశనం చేశాడు జగన్ రెడ్డి.

అంబేద్కర్ ఆశయాలను మంట గలిపిన తండ్రీ కొడుకులు:

దళితుల ఎసైన్మెంట్ భూములను మూడు తరాలుగా అనుభవించిన చరిత్ర వైఎస్ కుటుంబానిది.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను జలయజ్ఞం కాంట్రాక్టులకు, ఇడుపులపాయ రోడ్లకు మళ్లించి స్వాహా చేశారు.

జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రూ.33వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు.

భూమి కొనుగోలు పథకం, అంబేడ్కర్ విదేశీ విద్య, NSKFDC సబ్సిడీ రుణాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కులాంతర వివాహాల ప్రోత్సాహం లాంటి 27 పథకాలను రద్దు చేశారు.

విశాఖపట్నంలో డా. సుధాకర్ ను పిచ్చివాడిని చేసి చనిపోయేలా చేసిన నాటి నుంచి గత ఐదేళ్లలో దళితులపై 11 వేలకు పైగా దాడులు చేశారు. 188 మందిని చంపేశారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నే నిర్వీర్యం చేసి రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.అంబేద్కర్ కలలు కన్న ప్రజాస్వామ్య వ్యవస్థలను తన స్వలాభం కోసం సర్వనాశనం చేశాడు.

అంబేద్కర్ జీవితంలో ముఖ్య ఘట్టాలు :

బొంబాయిలో న్యాయవాద వృత్తి చేపట్టి నిరుపేదల హక్కుల కోసం పోరాటం చేశారు.అస్పృశ్యులను జనజీవన స్రవంతిలోకి తెచ్చేందుకు బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు.1927లో అస్పృశ్యులు మంచినీరు తాగే హక్కు కోసం మహద్ చెరువు పోరాటం చేశారుబొంబాయి శాసనమండలి సభ్యుడిగా నియమితులై దళితుల హక్కుల కోసం పోరాడారు.1930, 1931, 1932లలో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని అస్పృశ్యుల హక్కుల సాధనకు ఉద్యమించారు. 1936లో దేశంలోని అణగారిన వర్గాలు, కార్మికుల హక్కుల రక్షణకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు.1939లో బొంబాయి శాసనసభ సభ్యత్వం స్వీకరించారు.1942 లో దళిత వర్గాల సమగ్రాభివృద్ధికి షెడ్యూల్డు కాస్ట్స్ ఫెడరేషన్ స్థాపించారు.1946లో రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1947లో నెహ్రూ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖా మంత్రిగా పనిచేశారు. రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.1950 జనవరి 26 నుంచి నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు.1951 సెప్టెంబర్లో హిందూ కోడ్ బిల్లు తాను రూపొందించిన విధంగా ఆమోదం పొందనందుకు నిరసనగా న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశారు.1956 అక్టోబర్ 14న బౌద్ధధర్మాన్ని స్వీకరించారు. 1956 డిసెంబర్ 6న డా. బి. ఆర్. అంబేద్కర్ మరణించారు.1990లో డా. అంబేడ్కర్కు భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం "భారతరత్న" ప్రదానం.

ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ వార్డు మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com