Logo
Date of Publish : 29 May 2023, 4:22 pm
Editor : Sake Naresh

బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా? లేక వైసీపీ కార్యకర్తలకే ఎమ్మెల్యేవా?

      బొబ్బిలి ( జనస్వరం ) : తెర్లాం మండలం నందిగాం గ్రామంలో నిన్న స్థానిక MLA శంబంగి చినప్పలనాయుడు గడప గడపకు వైసిపి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా, తెర్లాం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మరడాన రవి ప్రభుత్వ పథకాలు మరియు ఉద్యోగాల విషయంలో MLA వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించగా ఏ పథకాలైనా, ఉద్యోగాలైనా మా పార్టీ వారికి ఇచ్చుకుంటాం కాని మిగతా వాళ్ల సంగతి మాకెందుకంటూ అప్రజాస్వామికంగా మాట్లాడటాన్ని జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి  బాబు పాలూరు గారు తీవ్రంగా ఖండించారు. ఓవైపు CM జగన్ నగరానికో సొంత ప్యాలెస్ లు, కోట్లలో వ్యాపారాలు, తన చుట్టూ పెత్తందార్లను పెట్టుకుని భయటకు మాత్రం పేదలకు పెత్తందార్లుకు యుద్ధం అంటూ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఇంకో వైపు తన MLAలు మా కుటుంబీకులు, మా పార్టీ మనుషులుకే పథకాలు, ఉద్యోగాలు ఇచ్చుకుంటాం మా ఇష్టం అంటూ బరితెగించి బహిరంగంగానే చెప్తుండుడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ బాబు పాలూరు గారు ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక భాషని మరోసారి పునరావృతం చేస్తే, ప్రజల తరపున జనసేన పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, వీర మహిళ యందువ యామిని, బొబ్బిలి నాయకులు పల్లెం రాజా, రామకృష్ణ నాయుడు, ఉమ, సత్య, శివ శంకర్, చీమల సతీష్, రాజు, సాయి తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com