చంద్రగిరి ( జనస్వరం ) : ఈ సమాజంలో జరిగే ప్రతి చర్యపై ప్రజలకు చేరవేసే ఏకైక సంస్థ మీడియా, వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత కష్టకాలంలో అయినా వారు ప్రజల తరపున, ప్రజల పక్షాన నిల్చున్నారు. అలాంటి మీడియా మరియు విలేఖరులపై చెవిరెడ్డి గారు దుర్భాషలాడి వారిని భయబ్రాంతులకు గురి చేయాలనుకోవడం హ్యేయమైన చర్య మరియు అధికార దుర్వినియోగంగా భావించాలని చంద్రగిరి జనసేన ఇంఛార్జ్ దేవర మనోహర్ అన్నారు. కరోనా కష్టకాలంలో అయినా, తుఫాన్ ఆపద సమయంలోనైనా మీడియా పాత్ర చాలా కీలకం, ప్రతి సమాచారాన్ని ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలకు మరియు ప్రభుత్వానికి చేరువేసి నిర్దిష్ట సమయంలో సాయం ఆందేలా చేసాయడంలో కీలకపాత్ర మీడియా మిత్రులదే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. అలాంటి మీడియా సోదరులను ఇంటికి పిలిపించి వారిని అసభ్య పదజాలంతో దూషించి, వారి కుటుంబసభ్యులను సైతం బెదిరించాలని చూడటం ఆటవిక చర్యగా భావించాలి. గతంలో నేను నక్సలైటుగా పనిచేశాను, మీ కోసం కొంతమంది మనుషులను తయారు చేసి ఉంచాను వారి మీ చర్మం వలిచేస్తారు అనడం ఆయన వ్యక్తిగత ప్రవర్తనకు అద్దం పడుతుంది, మీడియా మిత్రులకు ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఊహాహితతం. గతంలో నక్సలైటుగా పనిచేసి ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చి, ఈరోజు మంత్రి పదవి సైతం అధిరోహించి ప్రజల మన్నలను పొందిన వారిని చూసి నేర్చుకోండి…
నిరంతరం సిఎం గారికి భజన చేయడం తప్ప చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు నియోజకవర్గ అభివృద్ధికి మీరు చేసిన కృషి ఏంటి అని ప్రజలు గమనిస్తున్నారు. నియోజకవర్గంలో మీరు మీ కుటుంబం తప్ప ఏ ఒక్కరూ రాజకీయ కార్యకలాపాలు చేయకూడదని అధికారులకు హుకుం జారీ చేసి మీరు పబ్బం గడుపుతున్నారు ఇది శాశ్వతం కాదు… నియోజకవర్గంలో ఇతర పార్టీ పోస్టర్లు వేయకూడదు, కలపత్రాలు పంచకుడదు కేవలం మీ బ్యానర్లు మీ తనయుడి బ్యానర్లు మాత్రం కనిపించాలి లేకపోతే దేవుని పేరు చెప్పుకొని రోడ్లన్నీ మూసకపోయెలా మీ గురించి పెద్ద హార్డింగ్లతో ప్రచారం చేసుకోవాలి ఇంకెన్నాళ్ళు ఈ దౌర్జన్యం. ఆ కలియుగ వేంకటేశుడు మీరు చేసే ఆకృత్యాలను, దోర్జన్యాలు చూస్తున్నారు రానున్న రోజుల్లో మీ అధికార అహంకారాన్ని పూర్తిగా అణచివేస్తారన్నారు. ఈ రాష్ట్రంలో మీడియా ప్రతినిధులకు మరియు విలేఖరులకు అత్యంత గౌరవించే వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు అటువంటి నాయకుడి వెంట నడిచే మేము మీకు (మీడియా మిత్రులకు మరియు విలేఖరులకు) జనసేనపార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఈ మీడియా సమావేశంలో మండల అధ్యక్షులు సంజీవ్ హరి, కిషోర్ రాయల్, జనసేన నాయకులు తపసి మురళి రెడ్డి , గోపి రాయల్ , నవీన్, రఘు, సురేష్ , యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.