నెల్లిమర్ల ( జనస్వరం ) : డెంకాడ మండలం లోని ఎమ్మెల్యే బడుకొండ దత్తత గ్రామమైన బొడ్డువలస పంచాయతీలో జనసేన పార్టీ రోజుకు చాప కింద నీరులా విస్తరిస్తుంది. అధికార పార్టీకి చెక్ పెట్టే విధంగా, అసమ్మతిగా ఉన్న అధికార పార్టీ నాయకులను కలుపుకొని జనసేన ముందుకు వెళుతుంది. లోకం మాధవి గారి దూకుడికి తాళలేక అధికార పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. డెంకాడ మండలంలోని బడ్డువలస పంచాయతీలో, లోకం మాధవి గారు జనసేన పార్టీ ఆత్మీయ సభ ఏర్పాటు చేసి అధికార వైసీపీ సర్పంచ్ ఎర్ర శ్రీను ప్రధాన అనుచరులు అయిన కోరాడ అప్పారావు,కోరాడ గౌరీ,చందాక గోపి. గేద్ధ అప్పలరాజు. రమేష్. ఎర్ర సాయి. సుమారు మరో 50 మంది అలాగే మిగతా పంచాయతీలు అయిన మోపాడ, డి తాళ్లవలస నుండి ముఖ్య నాయకులు. అట్టాడ నాగరాజు కంది తతి నాయుడు. కంది బంగారయ్య. సుమారు 30 గ్రామం నుండి శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకున్నారు. కోరాడ అప్పారావు మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరడానికి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అలాగే తప్పు చేస్తే ప్రశ్నించే నైజం ఉన్న నాయకత్వ లక్షణాలు, అలాగే స్థానికంగా ఉన్న శ్రీమతి లోకం మాధవి గారి నాయకత్వం చూసి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని తెలిపారు. ఈ నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కష్టాలు మిగిల్చిందని అన్నారు. లోకం మాధవి గారు మాట్లాడుతూ బొడ్డవలస గ్రామ ప్రజలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని తమకి అండగా జనసేన పార్టీ ఉంటుందని, తనకి ప్రజలందరూ ఒక అవకాశం ఇవ్వాలని నియోజకవర్గాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటానని పరిశ్రమలు తెచ్చి యువతకి ఉపాధి కల్పిస్తానని ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను తెచ్చి ఉద్యోగాలు వేరే వారికి ఇచ్చి కాలుష్యం మనకి మిగిల్చారని మండిపడ్డారు. ప్రజలందరూ తనకి అవకాశం ఇస్తే నియోజకవర్గంలో చేపట్టబోయే మొట్టమొదటి కార్యక్రమం ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కులాయి అని అలాగే చదువుకున్న ప్రతి యువతీ యువకులకు పరిశ్రమంలో ఉద్యోగాలు రూపకల్పన చేస్తానని, బొడ్డువలస గ్రామ ప్రజలు సమస్య సర్వే నెంబర్ 8 ను తాను పరిష్కరిస్తానని తమ పంచాయితీలో అభివృద్ధికి దోహదపడతానని మాటిచ్చారు. వైసిపి ప్రభుత్వం ఇచ్చిన మాటలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అని విమర్శించారు. జగనన్న కాలనీలో పెద్ద మోసమని ఎక్కడో ఊరి చివర స్మశానాలు మరియు ప్రాంతాల్లో పేద ప్రజలకు స్థలాలు కేటాయించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కోరాడ అప్పారావు,కోన శివ,కుమార్ డెంకాడ సీనియర్ నాయకులు పైలాశంకర్, అట్టాడ ప్రమీల, బత్తుల. రామారావు. పిల్ల నాని. రమేష్.. K. రమేష్ భోగాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు వందనాల రమణ, భోగాపురం సీనియర్ నాయకులు పల్లా రాంబాబు, పల్లంట్ల జగదీష్ జోగారావు.పూసపాటి రేగ మండలం సీనియర్ నాయకులు గుడివాడ జమ రాజు మరియు తదితర నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com