- వైసీపీ ప్రభుత్వంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్నా కార్యక్రమం జరగట్లేదు
- మాకు కేటాయించిన టిడ్కో ఇళ్ళనూ ఇప్పటికీ మాకు ఇవ్వలేదు
- గతంలో అనేక హామీలు ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మూడేళ్లుగా మాయమైపోయారు
- పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన ముస్లిం సోదరులు
నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 31వ రోజున జాకీర్ హుస్సేన్ నగర్ లోని పలు వీధులలో జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా నేడు జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అలహరి సుధాకర్ పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద పలువురు ముస్లిం మైనారిటీ సోదరులు వైసీపీ ప్రభుత్వంలో తాము అనుభవిస్తున్న బాధలను చెప్పుకున్నారు. జాకీర్ హుస్సేన్ నగర్ లో అద్దెకు ఉంటున్న అనేకమందికి గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ళు మంజూరు అయ్యాయని తెలిపారు. గత ఎన్నికలప్పుడు టిడ్కో ఇళ్ళకు సంబంధించిన బ్యాంకు లోన్లను ఎవ్వరూ కట్టకండని, తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మూడేళ్లుగా పత్తా లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల్లో పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా ఖత్నా (ఒడుగులు తీసే కార్యక్రమం) కార్యక్రమాన్ని నిర్వహించేవారని, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆ ఊసే లేదని, డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి పిల్లలకు ఖత్నా చేయించేందుకు 15 వేల రూపాయలకు పైగా ఖర్చవుతుందని వాపోయారు. అన్ని రకాలుగా మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ సారి ఓటేసే ప్రసక్తే లేదని కేతంరెడ్డి వద్ద ముస్లిం సోదరులు తేల్చి చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని, ఆ దిశగా రాష్ట్రంలో రాజకీయ మార్పులు జరుగుతున్నాయని, మైనారిటీ సోదరులందరూ అల్లాకి దువా చేయాలని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడికి అండగా నిలుస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com