Logo
Date of Publish : 14 February 2023, 4:02 pm
Editor : Sake Naresh

సీఎం జగన్ రెడ్డి సమీక్షలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి వచ్చింది సున్నా మార్కులు

- ప్రజలలో తిరిగి మీరు చేసిన అభివృద్ధి తెల్పితేనే మళ్ళీ ఓట్లు పడతాయని సీఎం జగన్ అంటున్నారు

- కానీ తన ముఖం చూసి ఎవరూ ఓటు వేయరు అని తన గురించి అనిల్ బహిరంగంగా చెప్తున్నారు

- పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 274వ రోజున 47వ డివిజన్ సంతపేటలోని గుప్తా పార్క్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్రక్క ఎమ్మెల్యేలు గడప గడపకు తిరిగి తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తేనే వారు మళ్ళీ గెలుస్తారని సీఎం జగన్ రెడ్డి గారు చెప్తుంటే మరోప్రక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ మాత్రం తన ముఖం చూసి ఎవరూ ఓటు వేయరని, తనకంత సీన్ లేదని బహిరంగంగా తెల్పుతూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అనిల్ కుమార్ యాదవ్ నగరానికి సంబంధించి ఏమైనా అభివృద్ధి చేసుంటే కదా గడప గడపకు వెళ్ళి చెప్పుకోవడానికి అని దుయ్యబట్టారు. మూడు కాలువల బినామీ కాంట్రాక్టు కోసం పేదల ఇళ్ళను కూడా పగలగొట్టి వందల కోట్లు దోచుకోవడంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయిందని, అందుకే సీఎం జగన్ రెడ్డి సమీక్షలో అనిల్ కుమార్ యాదవ్ కి సున్నా మార్కులు వచ్చాయని అన్నారు. నియోజకవర్గంలో బలమైన శక్తిగా జనసేన పార్టీ మారిందని, పవన్ కళ్యాణ్ పై నగర ప్రజలు అపూర్వ అభిమానాన్ని చూపుతున్నారని, ప్రజలందరి ఆశీస్సులతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలవబోయేది తామేనని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com