అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 24వ డివిజన్ నవోదయ కాలనీలో పర్యటించి అక్కడ సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ స్థానిక మహిళలను ఎవరిని అడిగిన ఏ ఇంటికి వెళ్లిన హిందూ స్మశాన వాటికలో పెరుగుపోయిన చెత్త వ్యర్థాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వాటి దుర్వాసన భరించలేక అనేకమంది శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారని అంటూ అనంత వెంకట్రామిరెడ్డి ఇదేనా 800 కోట్ల అభివృద్ధి ఇది స్మశాన వాటిక డంపింగ్ యార్డ్ఆ అనే విధంగా ఉందని ప్రజల నుంచి ప్రతి ఇంటికి నేల నెల150 రూపాయల చెత్త పన్ను వసూలు చేస్తున్నారని అన్నారు. కానీ చెత్తను ఏమాత్రం తీయడం లేదని మున్సిపల్ ఉద్యోగులను అడిగితే మాకు డీజల్ కి డబ్బులు ఇవ్వడం లేదు అందుకే చెత్త ఇక్కడే వదులుతున్నమని సమాధానం చెప్తున్నారని అన్నారు. ఇలా గైతే ప్రజల ఆరోగ్య పరిస్తితి ఏమి కావాలని మేము ఈ ఎమ్మెల్యే ని ప్రశ్నిస్తున్నాము. ఈ సమస్యపై త్వరలోనే మున్సిపల్ ఉన్నతాధికారులను కలిసి వీరి సమస్య త్వరితగతిన పరిష్కారం అయ్యేలాగ కృషి చేస్తామని చెప్తూ ప్రజలు కచ్చితంగా జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి దరాజ్ భాష వీర మహిళలు లక్ష్మి సరోజమ్మా, కలన, సానియా, అనురాధ తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com