Search
Close this search box.
Search
Close this search box.

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి అనంతపురం నగర అభివృద్ధి పట్టదా ???

  అనంతపురం ( జనస్వరం ) : అర్భన్ నియోజక వర్గంలోని తపోవనం కూడలి నుంచి సోమనాథ్ నగర్ మీదుగా నగరంలోకి వెళ్ళే ప్రధాన రహదారిలో రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయాలని ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అందుకు నిదర్శనమే ఈ నడిమి వంక కాలువకు సంబంధించి తపోవనం కూడలి నుంచి బస్ స్టాండ్ కి మరియు రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారి మధ్యలో ఉండే నడిమి వంక కాలువ మీదుగా ఉండే సోమనాథ్ నగర్ వంతెన మరియు రోడ్డు నిర్మాణం అని అన్నారు. ఇక్కడ పరిస్థితిని చుస్తున్నట్లయితే రోజు వేలాది మంది ఈ రహదారి గుండానే ప్రాయానించవలసి ఉంటుందని కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే వంతెన నిర్మాణం, రోడ్డు సరిగా లేక వాహనదారులు చాలా ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు. అదేవిధంగా గత సంవత్సర కాలంలో నగరానికి వరదనీరు వచ్చి నడిమివంక పరిసర ప్రాంతాల వారు చాలా ఇబ్బందులు పడ్డారని అప్పుడు ఈ ఎమ్మెల్యే ముంపు ప్రాంతాలలో అడపా దడపా పర్యటించి నడిమివంకకు సంబంధించి ఇరువైపులా సేఫ్టీ గోడలు నిర్మిస్తామని అన్నారు. వంక అక్రమార్కుల చేతిలో అన్యాక్రాంతానికి గురైంది. ఆక్రమణకు గురైన వంక ప్రాంతాన్ని సర్వే చేయించి వంకని వెడల్పు చేస్తామని అలాగే నడిమి వంకలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తామన్నారు.  కానీ వరదలు వచ్చి పోయికుడా సంవత్సరం దాటిపోయిన ఇక్కడ సోమనాథ్ నగర్ వంతెన నిర్మాణం కానీ కాలువకు ఇరువైపులా సేఫ్టీ గొడలుకాని ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి తీసుకోవడం కానీ కాలువను శుభ్రం చేయడం ఇలాంటి చర్యలు ఎవి చేపట్టలేదు.  ఈ ఎమ్మెల్యే గారు ఈ ఎమ్మెల్యే గారిని మేము జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాము.  నీకు అనంతపురం నగర అభివృద్ధి పట్టదు అందుకే రాబోయే ఎన్నికలలో నగర ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు అనంతరం 2024 ఎన్నికలలో జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆతర్వాత అనంతపురo నగరాన్ని మేము సుందర అనంతగా తీర్చి దిద్దుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way