అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటమంతి కార్యక్రమంలో భాగంగా 18వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో పర్యటించారు. స్థానిక ప్రజల నుంచి పలు సమస్యలను తెలుసుకొని వాటిపై స్పందించారు... అనంతపురం ఎమ్మెల్యే అధికార దాహంతో అవినీతికి పాల్పడుతూ నకిలీ ఓట్లను అధికారం అడ్డుపెట్టుకొని విచ్చల విడిగా సృష్టించాడని ఇక్కడ డివిజన్ లో ప్రజలను మేము జనసేన టీడీపీ సానుభూతి పరులమని మా ఓట్లను తీసేశారని సచివాలయాల చుట్టూ తిరిగి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించి కున్న మా ఓట్లను ఎక్కించలేదని అన్నరన్నారు.. అదేవిధంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఈసారి ఎన్నికలలో ఘోర ఓటమి చవిచూస్తాడని గ్రహించి అవినీతి మార్గంలో నకిలీ ఓట్లను దాదాపు 20వేల వరకు ఎక్కించుకున్నాడని అన్నారు. అయినప్పటికీ అర్బన్ ప్రజలు ఈసారి వైకాపా అవినీతి పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని కచ్చితంగా ఈ సారి జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీలకు ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటితో పాటు ఇక్కడ స్థానికంగా మురుగు కాలువలు,మంచినీటి, వీధిదీపాల సమస్యలు ప్రధానంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com