– జనసేన ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు, (జనస్వరం) : 3 సార్లు శాసనసభ్యుడిగా ఏలూరు నియోజకవర్గంలో గెలిచిన ఆళ్ళనాని చేసిన అభివృద్ధి శూన్యం మని రెడ్డి అప్పల నాయుడు విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో మూడున్నర సంవత్సరాలు వైయస్సార్ ప్రభుత్వం చాటుతున్నప్పటికీ కూడా ఏ విధమైన అభివృద్ధి లేదని, ఇదే శాసనసభ్యుడు, వైద్య ఆరోగ్య శాఖమంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉండి ఏలూరులో 10 శాతం అభివృద్ధి నోచుకోలేని పరిస్థితుల్లో ఉందన్నారు. ఒక వైపున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎప్పటినుండో చెబుతున్నప్పటికీ కూడా ఆ డ్రైనేజీని శుభ్రపరిచిన దాఖలాలు లేవని, జిల్లా కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ హాస్పటల్ లో సరైన నియామకాలు లేవని,టెక్నీషియన్ లేరు పేషెంట్లకు కడుపునొప్పి వస్తే విజయవాడకు పంపించే పరిస్థితుల్లో జిల్లా కేంద్ర ఆస్పత్రి అద్వాన్నంగా తయారయిందన్నారు. మెడికల్ కాలేజీలు కడుతున్నామని శంకుస్థాపన చేశారు.. మెడికల్ కాలేజ్ కట్టె పరిస్థితి లేదన్నారు. ఒకవైపున టీడ్కో ఇళ్లకు మూడున్నర సంవత్సరాలు అయింది. 80 శాతం ఇళ్ళు కూడా పూర్తికాలేదు. శిధిలావస్థకు చేరుకున్నాయన్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నానికి ఓటు వేసిన పేదవాళ్ళని వేదివేసినట్లుగా ఊరికి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు దూరంలో అది కూడా లోటట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. పేదవాళ్లందరూ ఊరికి దూరంగా ఉండాలని ఆలోచనతోనే ఈ శాసనసభ్యుడు పరిపాలన ఉందన్నారు. ఏలూరులో ఉన్న ఒకే ఒక్క ఇండస్ట్రీ జూట్ మిల్ 2500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఉన్న ఆ ఒక్క జ్యూట్ మిల్లు మూత పడిపోతే కనీసం ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు నోరు విప్పని లేకపోతే ఎందుకు అని ప్రశ్నిస్తున్నాం. ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఏలూరు నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏమి చేసావు అని అడుగుతున్నాము. ఎందుకంటే ఈరోజున శవాల మీద డబ్బులు ఏరుకునే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. తీర్మానం నంబర్ 53వ జీవో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ లో డిసెంబర్ 13వ తేదీన చేసినటువంటి దుర్మార్గపు చర్యలు కూడా చూస్తున్నామన్నారు. అంటే ఏలూరులో ఇక ఏ మనిషి జీవించే పరిస్థితి లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఈ సందర్భంగా ఏలూరుని అన్ని రకాలుగా నాశనం చేసిన చరిత్ర ఒక్క ఆళ్ళనానికి దక్కుతుందని మేము ఘాటుగా చెబుతున్నామని రెడ్డి అప్పల నాయుడు అన్నారు. ఏలూరులో మీకు మూడుసార్లు అవకాశం ఇచ్చారు. మీరు మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. మీరు ప్రజలకు ఎక్కడ కూడా అందుబాటులో లేరు. ప్రజలే కదా మీకు ఓట్లు వేసింది. కానీ వాళ్లను తాకితే పాపం అన్నట్లుగా ప్రజలను వెలివేసి ప్రజలను దూరంగా తిప్పుకొని తిరిగే పరిస్థితిలో మీరు ఉన్నారన్నారు. మీ ప్రభుత్వంలో అన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయని రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ఒక కార్పొరేటర్, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ పనిచేయడానికి లేదు. వ్యవస్థలు అన్నిటిని నిర్వీర్యం చేసి మొత్తం నాశనం చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది వైయస్సార్ ప్రభుత్వానికి ఏలూరులో ఆళ్ల నానికి దక్కుతుందని రెడ్డి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందిరమ్మ కాలనీలో ఈరోజుకి కూడా రోడ్లు లేవు. డ్రైనేజీ లేదు. మంచినీటి సౌకర్యం లేదు. ఇన్ని సమస్యలు ఉండి కూడా దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఆళ్ల నాని వ్యవహరిస్తున్నారు. కొత్తూరులోని ఇందిరమ్మ కాలనీ, వైయస్సార్ కాలనీ, మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ, పాలగూడెంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ ఈ ప్రాంతంలో రోడ్లు వేయించి రక్షణ కల్పించాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. 2500 ఇల్లును ఇచ్చామని అట్టహాసంగా చెబుతున్నటువంటి లక్ష్మీపురంలో 8,9 కిలోమీటర్ల దూరంలో గాని పోణంగిలో గాని ఒక ఇల్లు కూడా నిర్మాణం జరగలేదని అన్నారు. ఇప్పటికైనా నిన్ను గెలిపించిన ఏలూరు ప్రజలకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత నీపైన ఉందని ఆళ్ళనానికి గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కావలసిన కనీస వసతులు, సిబ్బందులు, డాక్టర్లు, నర్సులు, వాళ్లను ప్రమోట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ నుండి తెలియజేస్తున్నాం. హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలకు పనిచేయాలని వైయస్సార్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఏలూరు జనసేన పార్టీ నుండి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నామన్నారు.