Logo
Date of Publish : 11 July 2022, 5:03 pm
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వములో అధికార దుర్వినియోగం శ్రుతిమించుతోంది : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

     మదనపల్లె, (జనస్వరం) : జగన్ రెడ్డి  ప్రభుత్వాన్ని చేపట్టిన తరువాత అధికార దుర్వినియోగం శ్రుతి మించిపోతుందని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత తెలిపారు. ప్రజల ఇబ్బందులు పట్టకుండా కేవలం తమ నాయకుల, కార్యకర్తల సౌకర్యం మాత్రం చూసుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలకు రికార్డ్ స్థాయిలో 1812 ఆర్టీసీ బస్సులను ఉపయోగించారు. ప్రైవేట్ కార్యక్రమాలకు ఆర్టీసీ సెక్యూరిటీ డిపాజిట్ తో పాటు అద్దె జీఎస్టీ కలిపి వసూలు చేస్తారు. వైసీపీ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా 1800 కి మించి బస్సులు తీసుకున్న వాటికి డిపాజిట్ చెల్లించలేదని తెలుస్తుంది. అధికారం తమ దగ్గర ఉందని ఇష్టమొచ్చినట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బస్ స్టాండ్ కిటకిటలాడింది కానీ బస్సులన్నీ వైసీపీ ప్లీనరీకి వెళ్లడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి  మీరు పార్టీ మీటింగులు పెట్టుకొంటే ప్రజలెందుకు ఇబ్బందులు పడాలి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అధికార దుర్వినియోగాన్ని ప్రజలందరూ ఏకమై ముక్త కంఠంతో ఖండించాలని అనిత తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com